Header Banner

ఆర్టీసీ బస్సుల్లో ‘తండేల్’ ప్రదర్శన కలకలం! విచారణకు ఆదేశాలు! బాధ్యులపై కఠిన చర్యలు!

  Tue Feb 11, 2025 15:29        Cinemas

నాగచైతన్య , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తండేల్‌’. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. అప్పటి నుంచి దీన్ని పైరసీ భూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్‌ అయిన రెండు రోజుల్లోనే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఏపీఎస్​ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ సంస్థ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘తండేల్‌’ పైరసీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 


దీని గురించి ఆ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. పైరసీని ప్రోత్సహిస్తోన్న వారిపై మండిపడ్డారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఆ పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం దారుణమని మండిపడ్డారు. చిత్ర విజయాన్ని ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలా సినిమాల్ని పైరసీ చేస్తున్నారని, వాట్సప్, టెలిగ్రామ్‌ గ్రూప్స్‌లో ఆ లింక్స్‌ను ఫార్వర్డ్‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలా పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని, వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశముందని హెచ్చరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


తమ చిత్ర పైరసీని ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించడం తీవ్రంగా బాధించిందని నిర్మాత అల్లూ అరవింద్​ వాపోయారు. ఈ విషయాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేబుల్‌ ఆపరేటర్లను కూడా హెచ్చరిస్తున్నామని తెలిపారు. తండేల్​ సినిమా క్లిప్‌ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతామని హెచ్చరించారు. తండేల్‌ను పైరసీ చేస్తే 95732 25069 నంబర్‌కు మెసేజ్‌ చేయండని వివరించారు. సాక్ష్యాలుంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని సూచించారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thandel #movie #bus #phiracy #todaynews #flashnews #latestupdate